Wednesday, January 22, 2025

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్‌కు వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు తెలంగాణ హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొదటి కోర్టు హాల్‌లో గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు బార్ అసోసియేషన్ ఉజ్జల్ భూయాన్‌ను సత్కరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జసిస్టస్ ఎన్.వెంకటనారాయణ భట్టి పదోన్నతి పొందిన సంగతి విదితమే. ఈ మేరకు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ బుధవారం ట్విట్టర్‌లో వెల్లడించారు. జస్టిస్ భూయాన్ తెలంగాణ హైకోర్టు, జస్టిస్ భట్టి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు. 2022 జూన్ 28 నుంచి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా భూయాన్ కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News