Tuesday, December 24, 2024

శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా

- Advertisement -
- Advertisement -

Kirit Somaya

ముంబై: బిజెపి నేత కిరీట్ సోమయ్య భార్య,  మేధా కిరీట్ సోమయ్య సోమవారం శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌పై బొంబాయి హైకోర్టులో రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మీరా-భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో మేధా కిరీట్ సోమయ్య , ఆమె భర్త కిరీట్ సోమయ్య  రూ.  100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని రౌత్ ఆరోపించారు. దాంతో మేధా కిరీట్ సోమయ్య ఈరోజు ముంబై హైకోర్టులో  రూ.100 కోట్ల పరువునష్టం దావాను  శివసేన సంజయ్ రౌత్‌పై  వేశారు అని కిరీట్ సోమయ్య ట్వీట్ చేశారు.

బిజెపి నేత కిరీట్ సోమయ్య మాట్లాడుతూ.. ‘తనకు పరువు నష్టం డబ్బు అక్కర్లేదని, ఆ డబ్బును సామాజిక సేవకు వినియోగిస్తాను’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News